విష్ణు సినిమాలో రాజ్ తరుణ్ | Multi starer movie with manchu vishnu, raj tarun | Sakshi
Sakshi News home page

విష్ణు సినిమాలో రాజ్ తరుణ్

Published Sun, Nov 15 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

విష్ణు సినిమాలో రాజ్ తరుణ్

విష్ణు సినిమాలో రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ జోరు పెంచుతున్నాడు. ఇప్పటికే ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో, త్వరలో కుమారి 21ఎఫ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. సుకుమార్ స్కూల్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో, చిత్ర విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ను అంగీకరించాడు రాజ్. మంచు విష్ణు హీరోగా చేస్తున్న ఓ సినిమాలో రాజ్ తరుణ్ను మరో హీరోగా ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. పంజాబీలో సూపర్ హిట్ అయిన ఓ కామెడీ ఎంటర్టైనర్ రీమేక్ రైట్స్ను చాలా కాలం క్రితమే తీసుకున్నాడు మంచు విష్ణు. అయితే అప్పటినుంచి ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు విష్ణు.

విష్ణు కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన దేనికైనా రెడీ సినిమాను డైరెక్ట్ చేసిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరు హీరోలు ఉండే ఈ సినిమా కోసం విష్ణుతో పాటు రాజ్ తరుణ్ను మరో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా సినిమాను తెరకెక్కిస్తున్న నాగేశ్వరరెడ్డి. ఆ సినిమా పూర్తయిన తరువాత విష్ణు, రాజ్ తరుణ్ల కాంబినేషన్లో తెరకెక్కే సినిమా పని మొదలెట్టనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement