'వాళ్లిద్దరి'తో గుండమ్మ కథ రీమేక్! | Gundamma Katha Remake with Vishnu Manchu and Raj Tarun? | Sakshi
Sakshi News home page

'వాళ్లిద్దరి'తో గుండమ్మ కథ రీమేక్!

Published Mon, Apr 25 2016 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

'వాళ్లిద్దరి'తో గుండమ్మ కథ రీమేక్!

'వాళ్లిద్దరి'తో గుండమ్మ కథ రీమేక్!

అలనాటి క్లాసిక్ హిట్ 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు కలిసి నటించిన 'ఈడో రకం ఆడో రకం' సక్సెస్ మీట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. 1962 క్లాసిక్ సినిమా గుండమ్మ కథను విష్ణు, రాజ్ తరుణ్ లను ప్రధాన పాత్రలుగా పెట్టి రీమేక్ చేయాలని ఉందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం తన వద్ద ఆ సినిమా రీమేక్ హక్కులు లేవని, సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు హక్కులను కొనుగోలు చేస్తానని అన్నారు.

గుండమ్మ కథ రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని పలువురు ప్రముఖులు చెప్పడం అడపాదడపా  వార్తల్లో వింటూనే ఉన్నాం. దివంగత నిర్మాత డా.డి.రామానాయుడు కూడా ఆ సినిమాను రీమేక్ చేయాలని ఆకాంక్షించారు. గుండమ్మ కథలో అన్నదమ్ములుగా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించిన  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల స్థానంలో వారి వారసులు జూ.ఎన్టీఆర్, నాగ చైతన్యలను రీమేక్ సినిమాలో చూడాలని పలువురు అభిమానులతోపాటు సినీ ప్రముఖుల కోరిక. తాజాగా ఈ సినిమాపై మోహన్ బాబు కూడా మనసు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ఆధ్వర్యంలో ఈ క్లాసికల్ మూవీ తెరకెక్కుతుందో చూడాలి మరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement