ఇటీవల కాలంలో సినీతారలు సామాజిక అంశాలపై కూడా భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ఉగ్రవాదుల దాడులు లాంటివి జరిగినప్పుడు అక్కడి బాధితులకు సాయం అదించటం. సాయం చేయాల్సిందిగా అభిమానులకు పిలుపునివ్వటం లాంటివి చేస్తుంటారు. అంతేకాదు పెను విషాదాలు సంభవించినప్పుడు తమ వినోద కార్యక్రమాలను వాయిదా వేస్తూ తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు.
ఇదేబాటలో తాజాగా స్వర సంచలనం దేవీశ్రీ ప్రసాద్ తన మ్యూజికల్ నైట్‌ను వాయిదా వేశాడు. ఈరోజు (శనివారం) సాయంత్రం హైదరాబాద్, నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో దేవీశ్రీ ప్రసాద్ మ్యూజికల్ షో నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమంతో పాటు దేవీ సంగీతం అందించిన కుమారి 21ఎఫ్ సినిమా ప్లాటినం డిస్క్ వేడుకను కూడా నిర్వహించాలని భావించారు. అయితే పారిస్‌లో జరిగిన మారణకాండతో ఈ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.
ప్రపంచం అంతా బాధలో ఉన్న సమయంలో తాము మాత్రం మ్యూజికల్ నైట్‌లో ఎంజాయ్ చేయటం సరికాదని భావించిన చిత్ర యూనిట్ తమ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ఈ వాయిదాపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినా, దేవీ మాత్రం వాయిదా వేసే ఆలోచనలోనే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.
ఉగ్రదాడులతో దేవీశ్రీ షో వాయిదా..?
Published Sat, Nov 14 2015 11:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM
Advertisement