
అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ ద్వారా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి కథానాయికగా పరిచయమయ్యారు. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించనున్న ఓ సినిమా ద్వారా నాగార్జున మలయాళ తెరకు హలో చెప్పనున్నారని టాక్. కాగా, మలయాళంలో నాగ్‌కి ఇది ఫస్ట్ మూవీ అయినా ప్రియదర్శన్‌తో మాత్రం సెకండ్ మూవీ. 1991లో వచ్చిన నాగార్జున ‘నిర్ణయం’ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడు అనే విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ప్రియదర్శన్ చేయనున్న ‘మరాక్కర్’ అనే మలయాళ సినిమాలో పాత్ర నచ్చడంతో నాగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట.
Comments
Please login to add a commentAdd a comment