లక్ష్మీనారసింహుడి పేరుతో సినిమా తీస్తా
దర్శకుడు కె.రాఘవేంద్రరావు వెల్లడి
యాదగిరికొండ: ఆ దేవుడు కరుణిస్తే యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుడి స్వామి పేరుతో భారీ పెట్టుబడితో సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు వెల్లడించారు. ఈనెల 10వ తేదీన విడుదల కానున్న నమో వేంకటేశాయ సినిమా విజయవంతం కావాలని బుధవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహస్వామి, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నమో వేంకటేశాయ సినిమా పూర్తిగా ఆధ్యాత్మిక, భక్తి పూర్వకంగా తీసినట్లు వెల్లడించారు. అక్కినేని నాగార్జునతో తీసిన భక్తి పూర్వకమైన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయని, ఈ చిత్రం కూడా సక్సెస్ కావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.