
సుధీర్‌బాబు
‘సమ్మోహనం’ సూపర్ సక్సెస్‌తో ఫామ్‌లో ఉన్నారు సుధీర్ బాబు. రీసెంట్‌గా ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్‌ని కూడా స్టార్ట్ చేశారు. సొంత ప్రొడక్షన్‌లో సుధీర్ హీరోగా నూతన దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రానికి ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రం ద్వారా నభా నతేశ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ‘‘సుధీర్‌బాబు గారు ఫస్ట్ టైమ్ నిర్మిస్తున్న చిత్రాన్ని డైరెక్ట్ చేయడం హ్యాపీ. ఆకట్టుకునే కథ, స్క్రీన్‌ప్లే, ఉత్తమ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరులో ఫస్ట్ లుక్, త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు.
Comments
Please login to add a commentAdd a comment