దోచుకోవాలని... | Nannu Dochukunduvate Movie Teaser | Sakshi
Sakshi News home page

దోచుకోవాలని...

Published Tue, Jul 17 2018 12:33 AM | Last Updated on Tue, Jul 17 2018 12:33 AM

Nannu Dochukunduvate Movie Teaser - Sakshi

సుధీర్‌బాబు

వినాయక చవితికి వస్తున్నారు సుధీర్‌బాబు. అవును.. ప్రేక్షకుల మనసులు దోచుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సమ్మోహనం’ విజయంతో జోష్‌ మీదున్న సుధీర్‌బాబు సొంత సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్ష¯Œ ్స బ్యానర్‌లో ఆర్‌.ఎస్‌.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తూ, హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో ఆఫీస్‌ మొత్తం భయపడే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మేనేజర్‌గా సుధీర్, గడుసు పిల్లలా నభా నటేశ్‌ నటించారు.

దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. రొమాంటిక్‌ కామెడీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్, నభాల జోడీ అందరి మనసులను దోచుకునే విధంగా ఉంటుంది. సెప్టెంబర్‌ 13న సినిమాని విడుదల చేస్తాం. అంతకు ముందు రోజు ప్రీమియర్‌ షోస్‌ ప్లాన్‌ చేస్తున్నాం. అజనీష్‌ సంగీతం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ రగుతు, ఆర్ట్‌: శ్రీకాంత్‌ రామిశెట్టి, ఎడిటర్‌: ఛోటా కె. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. సాయివరుణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement