పుణ్యక్షేత్రాల సందర్శన
పుణ్యక్షేత్రాల సందర్శన
Published Wed, Mar 19 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
నయనతారలో తాజాగా చాలా మార్పు కనిపిస్తోంది. దైవభక్తి తనలో బాగా పెరిగిందని ఆమె సన్నిహితులే చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న నయన, ఏ మాత్రం ఖాళీ దొరికినా పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవలే డెహ్రడూన్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ పూర్తి కాగానే ఆ చుట్టు పక్కల ఉన్న పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. హరిద్వార్, రిషికేష్‌ల్లోని పలు దేవాలయాలను సందర్శించారు. లక్ష్మణ్ జూలా, సప్తర్షి ఆశ్రమం, నీలకంఠ మహాదేవ్, సప్త సరోవర్ తదితర ప్రదేశాలను కూడా వీక్షించి ఆమె ఒక తన్మయత్వానికి లోనయ్యారట.
Advertisement
Advertisement