తమిళ చిత్రాలతోనే గుర్తింపు | Neetu Chandra identity of the Tamil citralatone | Sakshi
Sakshi News home page

తమిళ చిత్రాలతోనే గుర్తింపు

Published Tue, Jan 27 2015 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

తమిళ చిత్రాలతోనే గుర్తింపు

తమిళ చిత్రాలతోనే గుర్తింపు

తమిళ చిత్రాలతోనే తాను గుర్తింపు పొందినట్లు నటి నీతుచంద్ర పేర్కొన్నారు. ఈ బెంగాలీ సుందరి సొంతగడ్డపై నటిగానే కాకుండా నిర్మాతగా త్రాలు నిర్మించి అవార్డులు పొందారు. అయినా తమిళ చిత్రాలపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. కోలీవుడ్‌లో యావరుం నలం చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల చెన్నైకి విచ్చేసిన ఈ బ్యూటీ మాట్లాడుతూ ఏడాది గ్యాప్ తరువాత మళ్లీ తమిళంలో ఒక చిత్రం చేయనున్నానని చెప్పారు. దర్శకుడు షాజి కైలాష్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కథ చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు.
 
 తానిప్పటి వరకు పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో పోషించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నారు. మంచి సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రంగా ఉంటుందన్నారు. వ్యాపారాత్మక చిత్రాల్లో నటించే అవకాశాలు తనకు ఇక్కడే లభిస్తున్నాయన్నారు. తాజా చిత్రంలో కూడా ఆ తరహా పాత్రనే పోషించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుందని చెప్పారు. ఇటీవల 1980 ప్రాంత నటీనటుల విందులో కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఇందులో నటి శ్రీప్రియకు అంకితం ఇచ్చేలా ఆమె నటించిన చిత్రంలోని పాటకు తాను నర్తించానన్నారు. ఇది తనకు తీయని అనుభూమితిని మిగిల్చిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement