సంగీత్‌ వేడుకల్లో బిగ్‌బాస్‌ భామ | Nehha Pendse Shares Photos Her Sangeeth Ceremony | Sakshi
Sakshi News home page

నేడు బిగ్‌బాస్‌ భామ వివాహం

Published Sun, Jan 5 2020 11:23 AM | Last Updated on Sun, Jan 5 2020 11:29 AM

Nehha Pendse Shares Photos Her Sangeeth Ceremony - Sakshi

అటు వెండితెర, ఇటు బుల్లితెర రెండింటిలోనూ పాపులారిటీని సంపాదించుకున్న భామ నేహా పెండ్సే. గతంలో బిగ్‌బాస్‌ 12 హిందీలో పాల్గొన్న నేహా ఎక్కువ రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో నిలవలేకపోయింది. మెరుపుతీగలా వచ్చినదారినే వెళ్లిపోయింది. అయితే ఉన్నది కొన్ని రోజులే అయినప్పటికీ సంచలనాలు సృష్టిస్తూ తరచూ వార్తల్లో నిలిచింది. ఇక తెలుగులోనూ ‘సొంతం’, ‘వీధిరౌడీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా ఆ తర్వాత టాలీవుడ్‌లో జాడ లేకుండా పోయింది. ఆ తర్వాత మలయాళం, హిందీ భాషల్లోనూ నటించింది. కాగా నేహా పెండ్సే తన బాయ్‌ఫ్రెండ్‌ వ్యాపారి షార్దుల్‌ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే.

పెళ్లికి ముందు చివరి ముద్దు అంటూ తనకు కాబోయే భర్తను ముద్దాడుతూ నేహా నూతన సంవత్సరానికి వినూత్నంగా వెల్‌కమ్‌ చెప్పింది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అయింది. ఇక ప్రస్తుతం పెళ్లి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేహా ఇంట్లో సంగీత్‌ జరిగింది. ఈ సందర్భంగా నేహా పెండ్సే కాబోయే భర్తతో కలిసి డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. నేహా, షాదుల్‌ జంటల ఈడూజోడు బాగుందంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేడు నేహా పెండ్సే వివాహం బంధుమిత్రులు, స్నేహితుల, సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement