హిందీ బిగ్‌బాస్ ఫేమ్ నేహా పెండ్సే వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగా వైభవంగా జరిగింది. వ్యాపారవేత్త, తన బాయ్‌ఫ్రెండ్ అయిన షార్దూల్ సింగ్ బయాస్‌ను ఆదివారం ఆమె వివాహం చేసుకున్నారు. ఈ కొత్త పెళ్లి కూతురు వివాహ రిసెప్షన్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నిబద్ధతో ఏర్పడిన బంధంలో.. వాగ్ధానాలు, ఆశలు మాత్రమే ఉన్నాయి’ అనే క్యాప్షన్‌తో నేహా ఫొటోలు షేర్ చేశారు. ఇందులో..థై-హై స్టీట్ బాల్ బ్లూ ఫ్రాక్‌కు, డైమండ్ చౌకర్, మెస్సీ బన్ హేర్‌స్టైల్‌లో ఉన్న నేహాను చూసి ‘సింపుల్ అండ్ సూపర్’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా నేహా పెళ్లి ఫొటోలను చూసి.. ‘చూడముచ్చటైన జంట’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
కాగా పూర్తి మరాఠీ సాంప్రదాయ పద్దతిలో జరిగిన నేహా పెండ్సే తన వివాహా ఉత్సవంలో బేబీ పింక్ శారీకి.. సాంప్రదాయ ఆభరణాలను ధరించి మరాఠీ పెళ్లి కూతురుగా ముస్తాబయ్యారు. కాగా 1995లో వచ్చిన డీడీ మెట్రో షోకి కెప్టెన్‌గా వ్యవహరించిన నేహా తెలుగులో ‘సొంతం’ ‘వీధి రౌడీ’ సినిమాలు చేశారు. ఆ తర్వాత మళయాళ, హిందీ సినిమాలలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment