![Nikhil Gowda, Revathi Engagement on Feb 10 - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/10/Nikhil_Revathi.jpg.webp?itok=DO17A91H)
సాక్షి, బెంగళూరు: నేడు (సోమవారం) నగరంలోని తాజ్ వెస్టెండ్ హోటల్లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతి నిశ్చితార్థం జరగనుంది. ఆదివారం కుమారస్వామి బెంగళూరులో తన నివాసంలో నిఖిల్ నిశ్చితార్థం గురించి మీడియాతో మాట్లాడారు. వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఇలా సుమారు నాలుగైదు వేల మంది పాల్గొనబోతున్నారు. నిఖిల్ పెళ్ళిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నా. ‘ఈ పెళ్లి పైన నేను అనేక ఆశలు పెట్టుకున్నా. నటునిగా, రాజకీయ నేతగా నా కుమారుడిని ఆశీర్వదించిన వారినందరినీ ఈ పెళ్ళికి ఆహ్వానిస్తా. రామనగర–చెన్నపట్టణ మధ్యలో వివాహం నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ’ని తెలిపారు.
జాగ్వార్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నిఖిల్ గత లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ చేతితో పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment