
పెళ్లి క్యాన్సిల్ వార్తలపై నిఖిల్
కొద్ది రోజులు యంగ్ హీరో నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కొద్ది రోజులు యంగ్ హీరో నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిఖిల్ పెళ్లి తన బంధువుల అమ్మాయితో ఫిక్స్ అయినట్టుగా కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో నిఖిల్ తరుపున ఆ వార్తలు ఎవరూ ఖండించకపొవటంతో నిజమే అనుకున్నారు అంతా. అయితే తాజాగా జాతకాలు కలవని కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు తెర మీదకు వచ్చాయి.
అయితే ఈ సారి స్పందించకపోతే పరిస్థితి చేయిదాటుతుందనుకున్నాడేమో, నిఖిల్ ఈ వార్తలపై స్పందించాడు. నిఖిల్ పెళ్లి గురించి వచ్చిన ఓ వార్తను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నిఖిల్, అసలు పెళ్లి క్యాన్సిల్ అయినట్టుగా వచ్చిన వార్తలు నిజమో కాదో.. సూటిగా చెప్పకపోయినా.. ఈ వార్తలపై నేను స్పందించను అంటూనే.. నేను సింగిల్ గానే ఉన్నా.. త్వరలో చేయాల్సిన రెండు సినిమాల పనిలో బిజీగా ఉన్నా అంటూ కామెంట్ చేశాడు.
Ok. I dint want 2 comment on this.. but just to clear the air. I AM SINGLE nd commited only to the 2 movies that I'm working on @HydTimes pic.twitter.com/tHF1AyEtMx
— Nikhil Siddhartha (@actor_Nikhil) 1 September 2017