
వినోదమే ప్రధానం
మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రాజా దాసరి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నిను చూశాక’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజా దాసరి మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాల మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. వినోద ప్రధానంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. బ్రహ్మానందంగారు చేసిన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు.