నేను శైలజ దర్శకుడితో నితిన్ | Nithiin to work with nenu shailaja director | Sakshi
Sakshi News home page

నేను శైలజ దర్శకుడితో నితిన్

Feb 6 2016 1:12 PM | Updated on Sep 3 2017 5:04 PM

టాలీవుడ్లో ఒక్క హిట్ ఇస్తే చాలు ఆ దర్శకుడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూ కడతారు. అదే బాటలో ఈ ఏడాది మంచి సక్సెస్తో మొదలు పెట్టిన నేను శైలజ దర్శకుడు కిశోర్ తిరుమలను...

టాలీవుడ్లో ఒక్క హిట్ ఇస్తే చాలు ఆ దర్శకుడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూ కడతారు. అదే బాటలో ఈ ఏడాది మంచి సక్సెస్తో మొదలు పెట్టిన నేను శైలజ దర్శకుడు కిశోర్ తిరుమలను వరుస ఆఫర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేను శైలజ సినిమా తరువాత అదే దర్శకుడితో మరో సినిమా చేస్తానంటే రామ్ ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా మరో యంగ్ హీరో కూడా కిశోర్ తిరుమలతో సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నితిన్, తరువాత వరుస ఫెయిల్యూర్స్తో మళ్లీ ఢీలాపడిపోయాడు. తిరిగి ఫాంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్న నితిన్,  ప్రస్తుతం చేస్తున్న అ..ఆ.. పూర్తయిన తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో తన సొంతం నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించాడు. త్వరలోనే సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నట్టుగా తెలిపాడు నితిన్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement