
అభిమానులకు హీరో నితిన్ సడన్ సర్‌ప్రైజ్ చేశాడు. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు. అయితే దీపావళి కానుకగా అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘భీష్మ’కు సంబంధించిన పోస్టర్లను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మాస్, క్లాస్, లవ్, రొమాన్స్ షేడ్స్ కనిపించేలా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చెక్కించడం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అఆ తర్వాత భీష్మతో నితిన్ సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది.
‘అఆ’ తర్వాత ఈ యంగ్ హీరో నితిన్‌కు సరైన విజయాలు లేవు. 'లై', 'ఛల్ మోహన రంగ', 'శ్రీనివాస కళ్యాణం' వంటి వైవిధ్య కథాంశాలతో నితిన్ తీసిన సినిమాలు కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయాయి. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. చిన్న విరామం తర్వాత నితిన్ వరుసగా సినిమాలతో దూకుడు పెంచాడు. ‘భీష్మ’ షూటింగ్ జరుగుతుండగానే 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమా షూటింగ్ విజయదశమి రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో కీర్తి సురేష్ నితిన్ సరసన ఆడిపాడనుంది.ఇక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటితో కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నితిన్. భవ్య క్రియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వారియర్ కథానాయిక. అంతేకాకుండా తమిళంలో ధనుష్ నటించిన 'వాడ చెన్నై' సినిమాని పవర్ పేట పేరిట మరో సినిమాని చేయనున్నట్లు సమాచారం.
Here we go!
— nithiin (@actor_nithiin) October 27, 2019
First look of BHEESHMA!!
Wishin u all a very HAPPY DIWALI!!
#Bheeshma @VenkyKudumula @iamRashmika @vamsi84 @SitharaEnts pic.twitter.com/GxVfsRzUps