భీష్మ.. నితిన్‌ లుక్‌ ఇదే! | Nithin Look In Bheeshma | Sakshi
Sakshi News home page

భీష్మ.. నితిన్‌ లుక్‌ ఇదే!

Jul 11 2019 10:09 AM | Updated on Jul 11 2019 10:09 AM

Nithin Look In Bheeshma - Sakshi

వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీష్మ. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఛలో సినిమాతో వెండితెరకు పరిచయం అయిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లాంగ్ గ్యాప్‌ తరువాత ఇటీవల తిరిగి షూటింగ్ ప్రారంభించిన నితిన్‌ భీష్మ పనుల్లో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఈ సినిమాలో నితిన్‌ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా డీసెంట్‌ లుక్‌లో దర్శనమిస్తున్నాడు నితిన్‌. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాతో నితిన్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్‌దేతో పాటు చంద్ర శేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement