ఎన్టీఆర్‌ అభిమానులకు ‌తీవ్ర నిరాశ.. | No Special Video On NTR Birthday says RRR Unit | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..

Published Mon, May 18 2020 1:05 PM | Last Updated on Mon, May 18 2020 2:27 PM

No Special Video On NTR Birthday says RRR Unit - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌). షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొద్దివరకు చిత్రీకరణ పూర్తైయిన.. ఈ చిత్రం షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రామ్‌చరన్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ పుట్టిన రోజున(మే 20) కూడా చిత్ర బృందం నుంచి ఓ సర్‌ఫ్రైజ్‌ రానుందని అభిమానులు భావించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఎన్టీఆర్‌ బర్త్‌ డే నాడు ప్రత్యేక వీడియోను రిలీజ్‌ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. (చదవండి : ఎదురువడితే సావుకైనా చెమట ధారకడతది)

అయితే ఆ వార్తలపై ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ స్పందించింది. ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఎలాంటి ప్రత్యేక వీడియోను విడుదల చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది. ‘లాక్‌డౌన్‌ పలుమార్లు పొడిగించడంతో చిత్రానికి సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయి. మేము ఎంతగా ప్రయత్నించినప్పటికీ తారక్‌ బర్త్‌డే ట్రీట్‌ ఇవ్వలేకపోతున్నాం. కావున, ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మేము ఎలాంటి ఫస్ట్‌ లుక్‌ గానీ, వీడియో గానీ విడుదల చేయడం లేదు. మేము ఏదో ఒకటి రిలీజ్‌ చేయాలని భావించడం లేదు. మీరు ఎంతగా వేచి చూస్తున్నారో.. దానికి కచ్చితంగా విలువైన కానుక అందజేస్తాం. అది విడుదలైన రోజు మన అందరికి ఒక పెద్ద పండగలా ఉంటుంది’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ప్రకటనతో ఎన్టీఆర్‌ అభిమానులు నిరాశ చెందారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement