‘‘మన ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందాం’’ అంటున్నారు ఎన్టీఆర్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ‘‘బీ ది రియల్ మేన్’’ అనే ఛాలెంజ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటి పనుల్లో భర్త కూడా పాలు పంచుకోవాలన్నది ఈ ఛాలెంజ్ ఉద్దేశం. ఇంటి పనుల్లో సహాయం చేస్తున్న వీడియోను ట్వీటర్‌లో షేర్ చేసి ఆ ఛాలెంజ్‌ను వేరే వాళ్లకు విసరాలి. సందీప్ రాజమౌళికి ఛాలెంజ్ విసిరితే, రాజమౌళి తన ‘‘ఆర్‌ఆర్ ఆర్’’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి, ఇల్లు శుభ్రం చేస్తూ, గిన్నెలు సర్దుతూ, గార్డెన్ క్లీన్ చేస్తున్న వీడియోను షేర్ చేసి ‘‘పని భారాన్ని పంచుకోవడం ఓ సరదా’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్. అలాగే ఈ ఛాలెంజ్‌కు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లను ట్యాగ్ చేశారు. ఎన్టీఆర్ ఛాలెంజ్ అంగీకరించిన చిరంజీవి ‘‘మీ దోస్త్ చరణ్ వీడియో ఎక్కడ? ఇంకా పెట్టలేదు. నేను వెయిట్ చేస్తున్నాను’’ అని స్పందించారు.
మరోవైపు రామ్ చరణ్ కూడా తన ఛాలెంజ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘బట్టలన్నీ సర్దడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఫ్లోర్ శుభ్రం చేయడం, ఉపాసన (చరణ్ భార్య)కు కాఫీ కలిపి ఇవ్వడం వంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశారు చరణ్. ‘‘ఇంటి పనులు చేయడం గర్వంగా భావిద్దాం. మన ఇంటి పనులు చేసి నిజమైన మగవాళ్లం అనిపించుకుందాం’’ అని పేర్కొన్నారు చరణ్. త్రివిక్రమ్, రణ్‌వీర్ సింగ్, రానా, శర్వానంద్‌లకు చరణ్ ఈ ఛాలెంజ్‌ను విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment