
నందమూరి అభిమానులకు దసరా కానుక
నందమూరి అభిమానులు దసరాతో పాటు మరో పండుగకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' విజయదశమి రోజు, గురువారం సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ టీజర్ రిలీజ్ కానుంది. టెంపర్ సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న జూనియర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. 'వన్' ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేస్తుంది.
తన హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ రావటంతో టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ రివీల్ చేయకపోయినా గ్రాండ్ విజువల్స్తో అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉంటుదన్న టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ మ్యూజిక్తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.