ఎన్టీఆర్ పెద్ద ప్లానే వేశాడు | Ntr Targets Malayali market with koratala siva movie | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ పెద్ద ప్లానే వేశాడు

Published Thu, Dec 31 2015 10:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

ఎన్టీఆర్ పెద్ద ప్లానే వేశాడు

ఎన్టీఆర్ పెద్ద ప్లానే వేశాడు

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, తన తరువాతి ప్రాజెక్ట్  మీద కూడా భారీ కసరత్తులే చేస్తున్నాడు. ముఖ్యంగా యంగ్ హీరోలందరూ భారీ మార్కెట్ కోసం ఇతర భాషల మీద దృష్టి పెడుతుండటంతో జూనియర్ కూడా అదే ప్లాన్స్ గీస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటించనున్నాడు.

ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాను జనవరి నెలాఖరులో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో మళయాల మార్కెట్ మీద దండయాత్ర చేయాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే సినిమాలో కీలక పాత్రకు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ను ఎంపిక చేశారు. ఈ పాత్ర కోసం తెలుగు నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు మోహన్ లాల్. తాజాగా మరో పాత్రకు కూడా మళయాల నటుడినే ఎంపిక చేశారు.

ప్రస్తుతం మాలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా జనతా గ్యారేజ్లో నటించనున్నాడట. ఇప్పటికే కథ విన్న ఫాజిల్ డేట్స్ కూడా ఇచ్చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ఇద్దరు మళయాల స్టార్లు ఈ సినిమాలో నటిస్తుండటంతో జనతా గ్యారేజ్ను తెలుగుతో పాటు మళయాలంలో కూడా ఒకేసారి రిలీజ్ చేయోచ్చని భావిస్తున్నారట. అంతేకాదు ఈ ఇద్దరు మళయాలంలో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ కావటంతో ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉంటాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement