మెగా బ్యానర్లో నందమూరి హీరో..? | Ntr Trivikram Movie in Ram Charan production House | Sakshi
Sakshi News home page

మెగా బ్యానర్లో నందమూరి హీరో..?

Published Wed, Feb 22 2017 12:47 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

మెగా బ్యానర్లో నందమూరి హీరో..?

మెగా బ్యానర్లో నందమూరి హీరో..?

టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. మార్కెట్ పరంగా సినిమా స్థాయి కూడా భారీగా పెరిగిపోవటంతో గతంలో కనిపించిన విభేదాలు నేటి తరం హీరోల్లో పెద్దగా కనిపించటం లేదు. అంతేకాదు ఒక హీరో మరో హీరో సినిమాకు సాయం చేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చూపిస్తున్నారు. ఈ తరం మెగా, నందమూరి హీరోలు మరో అడుగు ముందుకేసి కలిసి పనిచేసుందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్లు కలిసి నటించేందుకు ఒకే చెప్పగా.. ఇప్పుడు మరో ఇద్దరు హీరోలు కూడా కలిసి పనిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యే నిర్మాతగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రామ్ చరణ్, ముందు ముందు మరిన్ని చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ లిస్ట్లో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా చరణ్ బ్యానర్ లోనే తెరకెక్కిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

గతంలో నందమూరి మెగా హీరోల మధ్య తీవ్రమైన పోటి కనిపించేది. అభిమానులు కూడా రెండు వర్గాలుగా విడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇండస్ట్రీ అంతా ఒకటే అని నిరూపిస్తున్నారు ఈ యంగ్ హీరోలు. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా మెగా నందమూరి హీరోల కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులు పండగ చేసుకోవటం మాత్రం కాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement