చంద్రుడికన్నా పైనున్నట్లుంది: హీరోయిన్‌ | Paul Feig congratulates SRK, Alia Bhatt for 'Dear Zindagi' | Sakshi
Sakshi News home page

చంద్రుడికన్నా పైనున్నట్లుంది: హీరోయిన్‌

Published Thu, Dec 1 2016 5:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

చంద్రుడికన్నా పైనున్నట్లుంది: హీరోయిన్‌

చంద్రుడికన్నా పైనున్నట్లుంది: హీరోయిన్‌

లాస్‌ ఎంజెల్స్‌: తన నటనను మెచ్చుకుంటూ ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు పాల్‌ ఫెయిగ్‌ ప్రశంసలు కురిపించడంతో తనకు చంద్రుడికంటె పైన ఉన్నట్లుందని ప్రముఖ బాలీవుడ్‌ నటి అలియా భట్‌ పేర్కొంది.  బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, నటి అలియా భట్‌కు ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు పాల్‌ ఫెయిగ్‌ నుంచి ప్రశంసలు దక్కాయి. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోన్న డియర్‌ జిందగీ చిత్రంలో వారిద్దరు చాలా అద్భుతంగా నటించారని అన్నారు. గోస్ట్‌ బస్టర్స్‌, ది హీట్‌ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన పాల్‌.. డియర్‌ జిందగీ దర్శకుడు గౌరీ షిండేను కూడా ప్రశంసల్లో ముంచెత్తారు. ఆమె చాలా అద్భుతమైన రచయిత అని అన్నారు.

‘డియర్‌ జిందగీ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచిన షారుక్‌ ఖాన్‌, అలియా భట్‌కు నా అభినందనలు’  అంటూ ఆయన తన పోస్ట్‌లో రాశారు. పాల్‌ కు షారుక్‌ స్నేహితుడు కాగా.. పాల్‌ భార్య లౌరీ కారన్‌ షారుక్‌కు మంచి అభిమాని. పాల్‌ తమను పొగడటంపట్ల ఈ ఇద్దరు బాలీవుడ్‌ నటులు కూడా పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. అలియా అయితే.. తనకు చంద్రుడిపైకి వెళ్లినట్లు ఉందంటూ ట్వీట్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement