ఢీ అంటున్న టాప్ హీరోలు.. | pavan, mahesh, allu arjun movies are planing to release in summer | Sakshi
Sakshi News home page

ఢీ అంటున్న టాప్ హీరోలు..

Published Sat, Nov 7 2015 10:01 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

ఢీ అంటున్న టాప్ హీరోలు.. - Sakshi

ఢీ అంటున్న టాప్ హీరోలు..

తెలుగు సినిమా స్టార్స్కు సమ్మర్ సీజన్ చాలా కీలకం. భారీ బడ్జెట్తో రూపొందిన సినిమాలతో పాటు కోట్ల వసూళ్లను కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్న టాప్ హీరోలు ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ సారి  వేసవికిలో భారీ యుద్ధమే జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలు బరిలో దిగుతుండగా మరో ఇద్దరు సీనియర్ హీరోలు కూడా అదే సమయంలో థియేటర్లలో సందడి చేసే చాన్స్ కనిపిస్తోంది.

షూటింగ్ స్టార్ చేసినప్పుడే సమ్మర్లో రిలీజ్ అంటూ ప్రకటించిన హీరో అల్లు అర్జున్. 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో సమ్మర్ సీజన్లో తిరుగులేదంటూ నిరూపించుకున్న బన్నీ ఈ సారి బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న 'సరైనోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు కూడా వేసవినే టార్గెట్ చేశాడు.

పవర్స్టార్ పవన్కళ్యాణ్ కూడా 'సర్థార్ గబ్బర్ సింగ్' సినిమాను సమ్మర్ సీజన్లోనే రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా ఇంత వరకు 50 శాతం షూటింగ్ కూడా పూర్తి కాకపోవటంతో వేసవికే బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇక 'డిక్టేటర్'గా వస్తున్న బాలయ్య కూడా అదే సీజన్ను టార్గెట్ చేసే  అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో నందమూరి చిన్నోడు ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో..' అంటూ వస్తుండటంతో బాలయ్య సినిమా వేసవిలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్  కనిపిస్తోంది. అసలే థియేటర్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇలా అందరు హీరోలు ఒకేసారి బరిలో దిగుతారా లేక, ఎవరైన వెనక్కి తగ్గుతారా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement