
పవన్ నాకు మామిడి పళ్లు పంపించలేదు!
అందాల భామ సమంతకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కాస్తంత కోపంగా ఉందట.
అందాల భామ సమంతకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కాస్తంత కోపంగా ఉందట. అది ఏదో పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమాలో అవకాశం ఇవ్వనందుకు కాదండోయ్. ఈ అందాల చిన్నది పవన్ పై అలగడానికి కారణం మామిడిపళ్లట. ఏంటీ.. మామిడిపళ్ల కోసమే పవన్ పై సమంతా ఈ మాత్రం వయ్యారాలు వలగబోయాల అనుకుంటున్నారా! మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ఎవరికైనా కోపం రావడం సహజమే కదండీ. అలాగే సమంతాకు వచ్చిందంట. 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ సమయంలో సమంతా తనకు మామిడిపళ్లంటే ఇష్టమని పవన్ కు చెప్పడమే ప్రధాన కారణం. తన ఫాంహౌస్ లో ఉన్న మామిడి తోటలోని పళ్లను పంపిస్తానని పవన్ మాట ఇచ్చి..ఇప్పుడు ఆ సంగతిని మరిచిపోయాడని ఆ అమ్మడు తెగ బాధపడుతోందట. దీనికంతటికీ కారణం పవన్ తనకు బాగా తెలిసిన వాళ్లకు మామిడిపళ్లను పంపించడమే. మొన్నామధ్య హీరో నితిన్ కు కూడా మామిడిపళ్లను పంపించాడు పవన్.
ఆ మామిడి పళ్ల రుచి చూసిప నితిన్ ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో సమంతా అసలు విషయం తెలుసుకుని ..పవన్ తన విషయాన్ని మరిచిపోయాడని తాజాగా గుర్తు చేసుకుంది. దీనిపై పవన్ కు ఓ ఉత్తరం కూడా రాస్తానని సమంతా అంటోంది.