
మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఏడాది కిందట ఆత్మాహుతికి పాల్పడిన మునికోటిని గుర్తుచేస్తూ 'సీఎంగారూ.. ఇతనెవరో తెలుసా?'.. అనే శీర్షికన 'సాక్షి' ప్రచురించిన కథనానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు.
మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ అనుచరులు తిరుపతిలో ఉన్న ముని కోటి కుటుంబానికి రూ.2 లక్షల చెక్ను అందజేసినట్లు సమాచారం. కష్టాల్లో ఉండి తన దృష్టికి వచ్చిన పలువురిని ఆదుకున్నారు పవన్. తాజాగా మునికోటి కుటుంబానికి అండగా నిలవడం మరోసారి ఆయన వితరణ గుణాన్ని చాటింది.
సరిగ్గా ఏడాది కిందట ప్రత్యేక హోదా నినాదంతో తిరుపతిలో ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు మునికోటి. అప్పట్లో ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినప్పటకీ.. ఏడాది గడచినా మునికోటి కుటుంబం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు.