పవన్ ముందే వస్తున్నాడు..! | Pawan trivikram movie release pre poned | Sakshi
Sakshi News home page

పవన్ ముందే వస్తున్నాడు..!

Published Sun, Oct 22 2017 1:21 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan trivikram movie release pre poned - Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రూపొందిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజయాలు సాదించటంతో తాజా చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు అజ్ఙాతవాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఓ మ్యూజికల్ టీజర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా జనవరి 10న రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అనుకున్న సమయం కన్నా ఒకరోజు ముందుగానే జనవరి 9 సాయంత్రం పెయిడ్ ప్రీమియర్ షోస్ తో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం ప్రీమియర్ షోస్ కోసం పట్టుబడుతున్నారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement