2019 అబ్బాయి.. 1993 అమ్మాయి! | play back new movie announcement | Sakshi
Sakshi News home page

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

Published Fri, Aug 2 2019 6:09 AM | Last Updated on Fri, Aug 2 2019 6:09 AM

play back new movie announcement - Sakshi

అనన్య, దినేష్‌ తేజ్

2019 కాలానికి చెందిన అబ్బాయితో తాను ఇంకా 1993లోనే ఉన్నానంటూ ఓ అమ్మాయి ఫోన్‌ కాల్‌ చేస్తుంది. ఆ తర్వాత ఏంటి? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. ‘దర్శకుడు’ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో తెరకెక్కనున్న తర్వాతి చిత్రానికి ‘ప్లేబ్యాక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందు మహేశ్‌బాబుతో సుకుమార్‌ తెరకెక్కించిన ‘నేనొక్కడినే’కి స్క్రిప్ట్, నాగచైతన్యతో తీసిన ‘100% లవ్‌’ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు హరిప్రసాద్‌. ఆయన దర్శకత్వంలో తాజా చిత్రాన్ని   పీఎన్‌కే ప్రసాద్‌రావు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ‘హుషారు’ ఫేమ్‌ దినేష్‌ తేజ్, ‘మల్లేశం’ ఫేమ్‌ అనన్య హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ నెల 5న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట.  కెమెరా: కె. బుజ్జి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement