
సినీరంగంలో డిమాండ్ ఉన్న తారలను తీసుకునేందుకు ఎంత పారితోషికం ఇచ్చేందుకైన సిద్ధమవుతున్నారు మన మేకర్స్. క్రేజ్, లక్కీ హ్యాండ్ అన్న అంచనాలతో తారలు ఎంత అడిగిన కాదనకుండా ముట్టజెపుతున్నారు. తాజాగా పూజా హెగ్డే పారితోషికం విషయంలోనూ ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో వరుసగా టాప్ హీరోల సరసన నటిస్తూ మంచి ఫాంలో ఉన్న ఈ భామను ఓ మీడియం రేంజ్ సినిమాలో నటింప చేసుందుకు ట్రై చేస్తున్నారు. అంతేకాదు కేవలం పది రోజుల కాల్షిట్స్ కోసం ఏకంగా కోటిన్నర ఆఫర్ చేసిన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. ఈ సినిమాలో ఓ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో నటించేందుకు పూజా హెగ్డే కోటీ యాబై లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.