
విశ్వనటుడు కమల్ హాసన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను నటి పూజా కుమార్ ఖండించారు. తనెవరితోనూ డేటింగ్‌లో లేనని స్పష్టం చేశారు. అలాగే కమల్ తదుపరి చిత్రం ‘తలైవన్ ఇరుకింద్రన్’ సినిమాలోనూ నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. భారత సంతతికి చెందిన అమెరికన్ నటి పూజా కుమార్ విశ్వరూపం 1& 2, ఉత్తమ విలన్ వంటి సినిమాలలో విలక్షణ నటుడితో కలిసి నటించారు. అయితే ఈ మధ్య కాలంలో కమలహాసన్ ఇంట్లో జరిగిన వేడుకల్లో పూజా తరచూగా కనిపిస్తుండటంతో కమల్.. పూజా రిలేషన్ షిప్‌లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. (ప్రధాని భారీ ప్యాకేజీ: కమల్ ఏమన్నారంటే?)
అంతేగాక విశ్వ నటుడికి, తన కుటుంబానికి పూజతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘చాలా కాలం నుంచి కమల్‌హాసన్, తన ఫ్యామిలీ నాకు తెలుసు. నేను అతనితో సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయన కుటుంబం, వాళ్ల పిల్లలు శ్రుతి, అక్షర హాసన్‌లు అందరూ పరిచయం’ అందుకే వారితో సాన్నిహిత్యంగా ఉంటాను’. అని పేర్కొన్నారు. కాగా పూజా అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు. మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99, బాలీవుడ్ హీరో వంటి హాలీవుడ్ చిత్రాలలో పూజా నటించారు. (హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు)
Comments
Please login to add a commentAdd a comment