రెండో పెళ్లి చేసుకున్న నటి ఊర్వశి | Popular Actress Urvashi Enters into Wedlock Again | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి చేసుకున్న నటి ఊర్వశి

Published Thu, Apr 3 2014 4:15 PM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

రెండో పెళ్లి చేసుకున్న నటి ఊర్వశి - Sakshi

రెండో పెళ్లి చేసుకున్న నటి ఊర్వశి

ప్రముఖ నటి ఊర్వశి రెండో పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్ను ఆమె పునర్వివాహం చేసుకున్నారు. సివిల్ ఇంజనీర్ అయిన శివప్రసాద్కు నిర్మాణరంగ సంస్థ ఉంది. కొన్ని నెలల క్రితం రహస్యంగా వీరి వివాహం జరిగింది. ఈ విషయాన్ని కేరళకు చెందిన ఓ మేగజీన్ వెల్లడించింది.

తన సోదరుడు కమల్కు శివప్రసాద్ మంచి మిత్రుడని, ఆయన తనకు బంధువులాంటి వాడని ఊర్వశి తెలిపారు. తమ కుటుంబం గురించి ఆయనకు బాగా తెలుసునని చెప్పారు. మలయాళ నటుడు మనోజ్ కె జయన్ను 2000లో ఊర్వశి వివాహం చేసుకున్నారు. 2008లో వీరిద్దరూ వీడిపోయారు. అప్పటినుంచి మళ్లీ సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో ఆమె నటించారు. కమల్ హాసన్తో ఆమె నటించిన సతీ లీలావతి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement