నా నటన చూసి అనుష్క నవ్వింది: పోసాని | posani krishna murali interview | Sakshi
Sakshi News home page

నా నటన చూసి అనుష్క నవ్వింది: పోసాని

Published Sun, Sep 14 2014 9:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

నా నటన చూసి అనుష్క నవ్వింది: పోసాని - Sakshi

నా నటన చూసి అనుష్క నవ్వింది: పోసాని

హైదరాబాద్: తప్పు పనిచేసినా నిజాయితీగా చేస్తానని రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. బయట ఒకలా, ఇంట్లో ఒకలా ఉండడం తనకు తెలియదని చెప్పారు. చాలా మందిలా తాను ముసుగు వేసుకోనని కుండబద్దలు కొట్టారు. దొంగోడయితే దూరంగా ఉంటా, చెడ్డవాడయితే కాలర్ పట్టుకుంటా, మంచిచోడయితే గౌరవంగా చూస్తా, మరీ మంచోడయితే దణ్ణం పెడతానని 'సాక్షి' టీవీ ఇంటర్య్వూలో అన్నారు. మంచిచోడు తనతో మాట్లాడకపోతే నేనేమైనా తప్పు చేశానా అని ప్రశ్నించుకుంటానని చెప్పారు.

మానాల మీద, శీలాల మీద తనకు నమ్మకం లేదని ప్రాణాల మీద నమ్మముందన్నారు. ఇప్పడు నటుడుగా ఖాళీగా లేకుండా ఉన్నానని, చేతినిండా సినిమాలున్నాయని వెల్లడించారు. గత ఏడాదిన్నరగా ఏ రోజు ఖాళీగా లేనని చెప్పారు. 'వేదం' సినిమా తర్వాత నటనకు స్వస్తి చెప్పి దర్శకత్వం చేయాలనుకున్నానని, కానీ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో నటుడిగా కొనసాగుతున్నానని వివరించారు.

ఈ సినిమా షూటింగ్ టైమ్ లో తన నటన చూసి హీరోయిన్ అనుష్క నవ్వు ఆపుకోలేకపోయిందని వెల్లడించాడు. ఇక దర్శకత్వం ఆపేసి నటన కొనసాగించమని చెప్పిందన్నారు. నటుడిగా కొనసాగాలని అల్లు అర్జున్ కూడా ప్రోత్సహించాడని చెప్పారు. 'నాయక్' సినిమా తర్వాత నాలుగు రోజుల్లో 36 సినిమా ఛాన్సులు వస్తే ఏం చేయాలే అర్థం కాక తన భార్య, బావమ్మర్ది, మేనేజర్ సలహా తీసుకున్నానని వెల్లడించారు. దర్శకత్వం ఎప్పుడైన చెయ్యొచ్చనని, నటనపై దృష్టి పెట్టాలని తనకు సూచించారని చెప్పారు. తనకు సినిమా తప్ప మరో వ్యాపకం తెలియదన్నారు. సినిమా రంగంలో అన్ని తెలుసునని పోసాని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement