అమితాబ్ బచ్చన్,బ్రయాన్ ఆడమ్స్, ప్రభాస్
టైమ్ దగ్గరపడుతోంది. ఎవరెవరికి ఆహ్వానాలు అందించాలి? ఏ ప్లేస్ సెలక్ట్ చేయాలి? ఎక్కడైతే వచ్చే అతిథులకు సౌకర్యంగా ఉంటుంది? అని తెగ ఆలోచిస్తున్నారట ప్రభాస్. ఏంటీ? పెళ్లి గురించి ప్రభాస్ ఏదైనా శుభవార్త చెప్పబోతున్నారా? అని ఆశ పడకండి. అందుకు టైమ్ ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో ఓ వెల్‌కమ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్. కెనడియన్ సింగర్ బ్రయాన్ ఆడమ్స్ వచ్చే నెలలో ‘అల్టిమేట్ టూర్’లో భాగంగా అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు రానున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం ‘బేర్ బోన్స్’ టూర్‌లో భాగంగా ఇండియా వచ్చారు బ్రయాన్.
మళ్లీ ఇప్పుడు కుదిరింది. ఆయనకు హైదరాబాద్‌లో వెల్‌కమ్ పార్టీ ఇవ్వనున్నారట ప్రభాస్. ఇక్కడ ప్రభాస్ అయితే బాలీవుడ్‌తో ఈ బాధ్యతను బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్ బి ఇచ్చే పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆల్రెడీ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్, ఆలియా భట్, ఫర్హాన్ అక్తర్ ఆసక్తిగా ఉన్నారట. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా అయితే మరో అడుగు ముందుకు వేసి అదే నెలలో విడుదల కానున్న తమ సినిమా ‘నమస్తే ఇంగ్లాండ్’ను ఈ పార్టీలో ప్రమోట్ చేయాలనుకుంటున్నారని బీటౌన్ టాక్. అదండీ విషయం.
Comments
Please login to add a commentAdd a comment