
ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. వీరి పెళ్లి కబురు వినడానికి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సల్మాన్ సంగతేమో గానీ ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ‘బాహుబలి ది కంక్లూజన్’ విడుదలైన తర్వాత ప్రభాస్ తప్పకుండా పెళ్లి పీటలు ఎక్కుతారని అనుకున్నారు అభిమానులు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ క్రమంలో ప్రభాస్, అనుష్కలు ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ డార్లింగ్, స్వీటీ ఈ పుకార్లను కొట్టి పారేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరో పుకారు షికారు చేస్తోంది. వచ్చే నెల తన పుట్టిన రోజు(అక్టోబర్ 23) సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రకటన చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సారైనా ఈ వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘సాహో’ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment