
డ్రగ్స్ కేసు: ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసు విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: బుధవారం సిట్ విచారణ అనంతరం పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో మెసేజ్ కు భారీ స్పందన లభిస్తోంది. ఈ విషయంలో పలువురు సినీ ప్రముఖులు పూరీ అండగా నిలుస్తున్నారు. గురువారం ఉదయం మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ కూడా పూరీకి మద్దుతుగా నిలిచాడు. మరో వైపు తన తండ్రికి అండగా నిలబడాలని పూరీ ఆకాశ్ సైతం కోరిన విషయం తెలిసిందే.
తాజగా దీనిపై ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. డ్రగ్స్ కేసులో మీడియా అత్యుత్సాహం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.ఇంకా విచారణ పూర్తి కాకుండానే, నిజాలు బయటకు రాకుండానే మీడియా ఎందుకు సంచలనం సృష్టిస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీడియా, ప్రజలు మేల్కొనాలన్నారు.
It is high time we the people and the media realise it's not fair to sensationalise issues before the complet truth comes out.