నిక్‌తో అనుబంధంపై ప్రియాంక సంకేతాలు | Priyanka Chopra Declares Nick Jonas Her Favourite Man | Sakshi
Sakshi News home page

నిక్‌తో అనుబంధంపై ప్రియాంక సంకేతాలు

Jun 27 2018 4:04 PM | Updated on Jun 27 2018 4:09 PM

Priyanka Chopra Declares Nick Jonas Her Favourite Man - Sakshi

సాక్షి, ముంబై : అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌తో కొద్దికాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు సాగుతున్న ప్రచారంపై ఇప్పటివరకూ నోరుమెదపని బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తమ అనుబంధంపై విస్పష్ట సంకేతాలు పంపారు. ప్రియాంక, నిక్‌ జోనాస్‌ పలు సందర్భాల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగుచూసినా వారు అధికారికంగా స్పందించలేదు. వచ్చే నెలలో వీరి వివాహ నిశ్చితార్ధం జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రియాంక చోప్రాను ఇప్పటికే తమ కుటుంబ సభ్యులకు నిక్‌ జోనాస్‌ పరిచయం చేశారు. మరోవైపు ఇటీవల ముంబయి వచ్చిన నిక్‌ ప్రియాంక కుటుంబసభ్యులతో మమేకమయ్యారు. ప్రియాంక బృందంతో నిక్‌ విహార యాత్రకు గోవా వెళ్లారు. గోవాలో ప్రియాంక, నిక్‌ల ఫోటోలూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా గోవాలో నిక్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ప్రియాంక తన ఫేవరెట్‌ మేన్‌ అంటూ హార్ట్‌ ఎమోజీతో క్యాప్షన్‌ ఇవ్వడం ద్వారా తమ అనుబంధంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఇక గతవారం ప్రియాంక నవ్వుతూ తనవైపు నడుచుకుంటూ వస్తున్న వీడియోను నిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement