
సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ల నిశ్చితార్థం వచ్చే నెలలో జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రియాంకతో కలిసి ముంబయి చేరుకున్న నిక్ జొనాస్ ప్రస్తుతం పీసీ కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో హాలిడే మూడ్‌లో ఉన్నారు. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం నడుమ బాహాటంగా మీడియా కంటపడటం, సన్నిహితంగా మెలగడంతో తమ అనుబంధంపై స్పష్టమైన ప్రణాళికతోనే వారు ముందుకు వెళుతున్నారనే సంకేతాలు వెల్లడయ్యాయి.
నిక్ జొనాస్‌ను ప్రియాంక తొలిసారి 2017 మెట్ గాలా ఈవెంట్‌లో కలిశారు. ఈ ఈవెంట్‌లో ఇద్దరూ రాల్ప్ లౌరెన్ దుస్తుల్లో మెరిశారు. అనంతరం నిక్ జొనాస్ తన కజిన్ వివాహ వేడుకలో ప్రియాంకను తమ కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన భరత్ మూవీలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment