ఆమెతో నటించాలని ఉంది! | Priyanka Chopra Has Another Hollywood Fan | Sakshi
Sakshi News home page

ఆమెతో నటించాలని ఉంది!

Published Thu, Feb 4 2016 8:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

ఆమెతో నటించాలని ఉంది!

ఆమెతో నటించాలని ఉంది!

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కెరీర్ టాప్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గత ఏడాది వరుస విజయాలు ఆమెను వరించాయి. అమెరికా టీవీ సిరీస్ 'క్వాంటికో' నటించడం ఆమెకు ప్రశంసలు తెచ్చిపెడితే.. దిల్ ధడక్నే దో, బాజీరావు మస్తానీ వంటి సినిమాలు విజయాలను ఇచ్చాయి. దీనికి తోడు ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో విజేతకు పురస్కారం అందజేసే అరుదైన గౌరవం కూడా ప్రియాంకను వరించింది. ఈ ఆనందం ఇలా కొనసాగుతుండగా మరోవైపు హాలీవుడ్ ఆఫర్లు ఈ అమ్మడి గుమ్మం ముందు ఎదురుచూస్తున్నాయి.

తాజాగా హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ కూడా ఈ దేశీగర్ల్ పై మనసు పారేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేనాల్డ్స్ మాట్లాడుతూ ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే ఓ హాలీవుడ్ సినిమాలో కనిపించిన ఆమెతో కలిసి నటించాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 'నేను ఆమె నటించిన 'క్వాంటికో' చూడలేదు. కానీ ఆమె ఇంటర్వ్యూలు చూశాను.  చాలా చార్మింగ్ గా ఉంది. ఆమెకు గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గొప్పగా నటిస్తోంది. ఆమెతో కలిసి పనిచేయడాన్ని నేను ఇష్టపడతాను.  ఎందుకు ఆమె అంతా బిగ్ స్టార్ అయిందో నేను స్వయంగా చూస్తాను' అని 'డెడ్ పూల్' స్టార్ రేనాల్డ్స్ పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమాల గురించి కూడా ఆయన కొనియాడారు. బాలీవుడ్ సినిమాలు తనకు ఎంతగానో నచ్చుతాయని, అవి ఎంతో సహజంగా, ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement