సన్నీలియోన్ స్థానంలో ప్రియాంక
సన్నీలియోన్ స్థానంలో ప్రియాంక
Published Sat, Oct 5 2013 1:10 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్‌లో విమర్శలను, ప్రశంసలను సమపాళ్లలో అందుకున్న నటి ప్రియాంక చోప్రా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. దేశంలోనే పేరెన్నిగన్న సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ నిర్వహించిన సర్వేలో దేశంలోనే అంత్యంత సంచలనాత్మక సెలబ్రిటీగా నిలిచారు ప్రియాంక. అంతకు ముందు ఈ స్థానం పోర్న్‌స్టార్ సన్నీలియోన్‌ది కావడం గమనార్హం.
తమకు ఇష్టమైన తారల వివరాలను తెలుసుకోవడం కోసం అభిమానులు ఇంటర్నెట్ ద్వారా చేసే ప్రయత్నా లనే లెక్కించి... అత్యధికంగా ఏ సెలబ్రిటీ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపించారో...వారిని నంబర్‌వన్‌గా పరిగణించడం జరుగుతుందని సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ప్రతినిధి ముంబయ్‌లో జరిగిన ఓ సమావేశంలో వెలిబుచ్చారు.
గత ఏడాది సన్నీలియోన్ నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకోగా, ఈ ఏడాది ఆమెను వెనక్కినెట్టి ప్రియాంక ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. రెండు మూడు స్థానాల్లో షారుక్, సల్మాన్‌లు నిలవడం గమనార్హం. దీని గురించి ప్రియాంక స్పందిస్తూ -‘‘నన్నింతగా అభిమానిస్తున్న అభిమానులకి జీవితాంతం రుణపడి ఉంటాను. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అని ఆనందం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement