ప్రియాంకకు మరో ఛాన్స్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అగ్రరాజ్యంలో పాగా వేస్తోంది. అమెరికాలో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. 'క్వాంటికో' అమెరికన్ టీవీ సిరీస్ తో మెప్పిస్తున్న ప్రియాంక మరో ఛాన్స్ దక్కించుకుంది. ఏసీబీ చానల్ లో అమెరికన్ సెలబ్రిటీ టాక్ షో హోస్ట్ గా ఆమెకు అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశం అంగీకరించాలా, వద్దా అనే దానిపై ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
33 ఏళ్ల ప్రియాంక చోప్రా మొదట తన సంగీతంతో నేరుగ అగ్రరాజ్యంలో అడుగుపెట్టింది. తర్వాత ప్లేన్స్ సినిమాలో డిస్నీ పాత్రకు గాత్రదానం చేసింది. 'క్వాంటికో'తో మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ టీవీ సీరియల్స్ లోకి అడుగు పెట్టింది. ఈ సీరియల్ లో 'అలెక్స్ పర్రిస్' గా నటించింది. తన పాత్రకు వస్తున్న స్పందన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఆమె హిందీలో నటింటిన 'బాజీరావ్ మస్తానీ' సినిమా డిసెంబర్ లో విడుదలకానుంది. ప్రకాశ్ ఝా 'జై గంగాజల్' సినిమాను తన ఖాతాలో వేసుకుంది.