అమెరికన్ టీవీ షోలో! | neethu chandra in american tv show | Sakshi
Sakshi News home page

అమెరికన్ టీవీ షోలో!

Published Tue, Dec 22 2015 12:28 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

అమెరికన్ టీవీ షోలో! - Sakshi

అమెరికన్ టీవీ షోలో!

ఒక్క అమెరికన్ టీవీ షోతో ప్రియాంకా చోప్రా కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లోకెళ్లిపోయింది. ఈ టీవీ షో పుణ్యమా అని  ఓ భారతీయ నటి హోర్డింగ్స్ అమెరికాలో వాడవాడలా వెలిశాయి. ఈ షో తర్వాత ప్రియాంకకు హాలీవుడ్ చిత్రాలకు అవకాశం వస్తోంది. ఈవిడగారికి వచ్చిన క్రేజ్ చూసి, ఇప్పుడు హాలీవుడ్‌లో ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకూడదని కొంతమంది బాలీవుడ్ తారలు ఫిక్స్ అయ్యారు. ఆ మాటకొస్తే... ప్రియాంకకు వచ్చినట్లుగా ఏ అమెరికన్ టీవీ షోకి అవకాశం వచ్చినా ఎగిరి గంతేసి ఒప్పేసుకోవాలనుకుంటున్నారు. నీతూచంద్ర కూడా అలానే ఫిక్సయ్యారేమో.. అందుకే ఓ అమెరికన్ టీవీ షో ఒప్పేసుకున్నారు. తెలుగులో ‘గోదావరి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీతు ఆ తర్వాత హిందీ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ హాలీవుడ్ షోతో బిజీ అయిపోయారు. ‘‘ఈ షోలో నాది లీడ్ రోల్. వినోద ప్రధానంగా సాగే షో ఇది. ఇందులో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. నాకిది ఓ మంచి ఎక్స్‌పీరియన్స్’’ అని నీతూ చంద్ర పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement