
బిగ్‌బాస్ ఇంట్లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల చిత్రంలో జండూభామ్ (సునీత)గా ప్రేక్షకులను అలరించి.. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్ కూతురు పార్వతి పాత్రలో ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. చిన్న చిన్న పాత్రలను చేస్తూ.. క్రేజ్‌ను సంపాదించుకుంటోన్న పునర్నవి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వందరోజుల పాటు సాగే ఈ షోలో ఆడియన్స్‌ను ఆకట్టుకుని, ఎలిమినేషన్స్‌ను తప్పించుకుని చివరి వరకు కొనసాగుతుందా?