మా నాన్నకు సంబంధం లేదు : పూరి కూతురు | Puri Jagannath Daughter Pavithra Fires On Media | Sakshi
Sakshi News home page

మా నాన్నకు సంబంధం లేదు : పూరి కూతురు

Published Sun, Jul 16 2017 10:36 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

మా నాన్నకు సంబంధం లేదు : పూరి కూతురు - Sakshi

మా నాన్నకు సంబంధం లేదు : పూరి కూతురు

ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించటం పై ఆయన కూతురు పవిత్ర పూరి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇతరులు గురించి వార్తలు రాసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిజం తెలుసుకోకుండా ఇతర మీద నిందలు వేయోద్దు.కేవలం మా నాన్న సెలబ్రిటీ అయిన కారణంగా ఆయన మీద పుకార్లు సృష్టించటం కరెక్ట్ కాదు. ఆయన మీద నిందలు వేసే ముందు ఆయన కుటుంబం గురించి వారి గౌరవ మర్యాదల గురించి ఆలోచించండి.  

నేను మాట్లాడేది పనీ పాట లేకుండా పిచ్చి మాటలు మాట్లాడే వారి గురించి మాత్రమే. మా నాన్న ఉన్నత లక్ష్యాలతో పనిచేసే వ్యక్తి. ఓ దర్శకుడిగా ఆయన ఆలోచనే ఆయన పెట్టుబడి, భవిష్యత్తు.అలాంటిది ఆయన కెరీర్ ను ఆయనే ఇలాంటి అలవాట్లతో ఎందుకు నాశనం చేసుకుంటాడు.గుర్తుంచుకోండి సెలబ్రిటీ అంటే పబ్లిక్ పర్సనాలిటీ కాదు. మా నాన్నకు డ్రగ్స్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. జాగ్రత్తగా మాట్లాడండి.' అంటూ ఘాటుగా తన అభిప్రాయాలను సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసింది.

 

 

Plzzzz repost...

A post shared by Pavithra Puri (@pavithra_puri607) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement