Rajamouli New Announcement about NTR and Ram Charan's RRR Movie on NTR's Birthday - Sakshi
Sakshi News home page

May 16 2018 3:09 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli Announcement About Multistarrer Movie Nn Ntr Birthday - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది.. కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయి... అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.

ఈ నెల 20న ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ మల్టీస్టారర్‌కు సంబంధించి రాజమౌళి కీలక ప్రకటన చేయనున్నారట. అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ లేకపోయినా.. మెగా మల్టీస్టారర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ రావటం ఖాయమని తెలుస్తోంది. అంతేకాదు అదే రోజు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement