రాజమౌళి నెక్ట్స్ సినిమా అదే | Rajamouli next movie with sunny deol in bollywood | Sakshi
Sakshi News home page

రాజమౌళి నెక్ట్స్ సినిమా అదే

Apr 19 2016 8:42 AM | Updated on Jul 14 2019 4:05 PM

రాజమౌళి నెక్ట్స్ సినిమా అదే - Sakshi

రాజమౌళి నెక్ట్స్ సినిమా అదే

ప్రస్తుతం, టాలీవుడ్లోనే కాదు జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో వినిపించే తెలుగు దర్శకుడి పేరు రాజమౌళి.

ప్రస్తుతం, టాలీవుడ్లోనే కాదు జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో వినిపించే తెలుగు దర్శకుడి పేరు రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి సొంతం చేసుకున్న రాజమౌళి, ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క లీడ్ రోల్స్లో తెరకెక్కిన బాహుబలి 600 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బాహుబలి 2 కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు.
 
అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాల తరువాత రాజమౌళి చేయబోయే సినిమా ఏంటి అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి ఓ హిందీ సినిమాకు వర్క్ చేయనున్నాడు. కానీ ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు కాదు, కేవలం క్రియేటివ్ డైరెక్టర్గా తన సహాయం అందించనున్నాడు. ఇటీవల ఘాయల్ వన్స్ అగైన్ సినిమాతో నిరాశపరిచిన సన్నీడియోల్ త్వరలో మేరా భారత్ మహాన్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు.
 
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సక్సెస్ సినిమాల కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసమే రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్గా మారుతున్నాడట. గతంలో విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన రాజన్న సినిమా కోసం కూడా కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన జక్కన్న ఇప్పుడు మేరా భారత్ మహాన్ సినిమా కోసం మరోసారి తండ్రికి సాయం చేయడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement