
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలిసి వారికి ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక చింతన గురించి కూడా తెలిసే ఉంటుంది. సినిమాలో మాస్ ఆడియన్స్ ఉర్రూతలూగించే సూపర్ స్టార్, ఎక్కువగా హిమాలయాల్లో సాధువులతో కలిసి ఆధ్యాత్మిక గురించి చర్చిస్తుంటారు. తాజాగా రజనీ, కొంత మంది స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించారు.
ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద శిష్యుడైన రజనీ, గురువు స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురుశరణ్ పేరుతో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఆశ్రమాన్ని నవంబర్ 10న ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 2.0, కాలా చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నరజనీ.. వచ్చే సంవత్సరం ఈ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ ఆశ్రమాన్ని రజనీ ఎంతో బలంగా విశ్వసించే బాబాజీ గుహకు దగ్గరల్లోనే నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment