
‘పీఎస్వీ గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో జోష్ ట్రాక్‌లో ఉన్న రాజశేఖర్ నటించనున్న తాజా చిత్రం వచ్చే నెల ఆరంభం కానుంది. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ చేసిన టీమ్‌కి తమిళ దర్శకుడు, మాటల రచయిత జాన్ మహేంద్రన్ నేతృత్వం వహించారు.
చిత్రదర్శక, నిర్మాతలు, జాన్‌మహేంద్రన్, సినిమా తెలుగు డైలాగ్ రైటర్, గేయ రచయిత విశ్వ వేమూరి కథ, స్క్రీన్‌ప్లేను సోమవారం రాజశేఖర్, జీవితలకు అందజేశారు. ‘‘కథ చాలా బాగుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగా కుదిరింది. ఉత్కంఠభరితంగా సాగడంతో పాటు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘హైదరాబాద్, చెన్నైలో సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని జి. ధనుంజయన్ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం, సంపత్ నటించే ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.పి. శివప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment