ఆలోచింపజేసే ఇతివృత్తం | Rajendra Prasad Alochinchandi Movie Launch | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే ఇతివృత్తం

Published Mon, Jun 2 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

ఆలోచింపజేసే ఇతివృత్తం

ఆలోచింపజేసే ఇతివృత్తం

 డా. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆలోచించండి’. యువరాజ్, అనిల్ కల్యాణ్, అంజలీరావ్ ఇందులో హీరో హీరోయిన్లు. బడుగు పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఎ. మాధవి మోహన్, కె.ఎ. దేవని నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డా.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సునీల్ కుమార్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆలోచింపజేసే కథ ఇది. కథ వినగానే రాజేంద్రప్రసాద్ చేయడానికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా కథకు బోలెడన్ని మెరుగులు కూడా దిద్దారు. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. కులమతాల ప్రస్తావన కూడా ఉంటుంది’’ అని చెప్పారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో అయిదు పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె. హేమంత్‌నాయుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement