Anil Kalyan
-
గల్ఫ్ వెతలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ రాని గల్ఫ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్’. చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య, నల్ల వేణు ప్రధాన పాత్రధారులు. పి. సునీల్ కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించారు. జూలై మొదటివారంలో పాటల్ని, రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘గల్ఫ్ దేశాలన్నీ పర్యటించి, దాదాపు 400కి పైగా కేస్ స్టడీలు తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది. చిన్నారాయణ రాసిన చక్కటి భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘సరిహద్దులు దాటిన ప్రేమ కథ అనే ఉప శీర్షికతో వస్తోన్న చిత్రమిది. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘క్రిమినల్ ప్రేమ కథ’ల కన్నా పెద్ద కమర్షియల్ హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత. ‘‘గల్ఫ్ నేపథ్యంలో తెలుగులో ఇప్పటికీ ఒక్క సినిమా రాకపోవడం ఆశ్చర్యం. సునీల్ కుమార్‌రెడ్డి ఆ లోటు తీర్చేసారు. ఆయనలోని జర్నలిస్ట్ ఈ సినిమా తీయడానికి ఉసిగొల్పినట్టు అనిపిస్తోంది’’ అని మాటల రచయిత పులగం చిన్నారాయణ అన్నారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బాపిరాజు పాల్గొన్నారు. -
హాస్యరస విచిత్రం...!
సినిమా నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. చాందిని, మనోజ్‌నందం, అనీల్కల్యాణ్ ముఖ్యతారలుగా ప్రకాశ్ బలుసు దర్శకత్వంలో పి.ఉమాకాంత్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘రెగ్యులర్ ఫార్మట్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: కనకేశ్ రాథోడ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాము. -
'ధనలక్ష్మి తలుపు తడితే' స్టిల్స్
-
లాభం తెచ్చే ధనలక్ష్మి
‘‘కొన్ని పరిస్థితుల కారణంగా అనుకోకుండా ఈ చిత్రానికి భాగస్వామి అయ్యా. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, తాగుబోతు రమేశ్ నా మీద ఉన్న అభిమానంతో పారితోషికం తీసుకోకుండా చేశారు. ఇతరులు నామమాత్రం పారితోషికం తీసుకుని ఈ సినిమా చేశారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నటుడు ధనరాజ్ అన్నారు. మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో ధనరాజ్, మనోజ్ నందం, శ్రీముఖి, అనిల్ కల్యాణ్, తాగుబోతు రమేశ్ తదితరులు ముఖ్య తారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ధనలక్ష్మీ తలుపు తడితే’. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బోలో శావలి పాటలు స్వరపరిచారు. ఈ సినిమా ప్రచార చిత్రాలను నిర్మాత కె.ఎల్. దామోదర్, దర్శకురాలు నందిని విడుదల చేశారు. మొదట్లో సంకోచించినా, ఇప్పుడీ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉందని రామసత్యనారాయణ అన్నారు. ఈ ధనలక్ష్మీ లాభం తెచ్చే సినిమా అవుతుందని అతిథులు పేర్కొన్నారు. -
ఒక క్రిమినల్ ప్రేమ కథ మూవీ న్యూ స్టిల్స్
-
ఒక క్రిమినల్ ప్రేమ కథ మూవీ పోస్టర్స్, స్టిల్స్
-
ఒక క్రిమినల్ ప్రేమ కథ మూవీ ఆడియోలాంచ్
-
‘ఆలోచించండి’ మూవీ ప్రారంభోత్సవం
-
ఆలోచింపజేసే ఇతివృత్తం
డా. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆలోచించండి’. యువరాజ్, అనిల్ కల్యాణ్, అంజలీరావ్ ఇందులో హీరో హీరోయిన్లు. బడుగు పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఎ. మాధవి మోహన్, కె.ఎ. దేవని నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డా.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సునీల్ కుమార్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆలోచింపజేసే కథ ఇది. కథ వినగానే రాజేంద్రప్రసాద్ చేయడానికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా కథకు బోలెడన్ని మెరుగులు కూడా దిద్దారు. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. కులమతాల ప్రస్తావన కూడా ఉంటుంది’’ అని చెప్పారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో అయిదు పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె. హేమంత్‌నాయుడు.