టామీతో అనుబంధం
కుక్కకూ, యజమానికీ మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘టామీ’. ఇందులో యజమానిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. కుక్క చేసే విన్యాసాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి చెబుతున్నారు. పాలకొల్లు, నరసాపురం పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని, నరసాపురం రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల పాటు చిత్ర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించామని రాజా వన్నెంరెడ్డి తెలిపారు.
నిర్మాత హరిరామజోగయ్య మాట్లాడుతూ- ‘‘1925-37 మధ్యకాలంలో జీవించిన ఓ పెంపుడు శునకం యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 20 నాటికి షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. సీత, సురేశ్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, వేణుమాధవ్, ముంతాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: రాజేంద్రకుమార్, కెమెరా: మోహన్, సంగీతం: చక్రి, పాటలు: అనంతశ్రీరామ్.